భద్రాచలం, నేటిసూర్య ప్రతినిధి: భద్రాచలంలో మీడియా సభ్యులతో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా మొబగాపు ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పిల్లి రాజు, ఉపాధ్యక్షులుగా బట్టు శ్రీనివాసరావు, కోశాధికారిగా పసుపులేటి వేంకటేశ్వర బాబు, గౌరవ అధ్యక్షులుగా తోకల నాగేశ్వరరావు, గౌరవ సలహాదారులుగా తామరపల్లి ఆనందరావులతో పాటు మరికొందరు సభ్యులతో కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యక్ష కార్యద ర్శిలు మాట్లాడుతూ విలేఖర్లు ఎదుర్కొం టున్న సమస్యల్ని పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. అలాగే విలేఖర్ల కుటుంబాలకు ఉచిత వైద్య, విద్య సదుపాయాలు కలిగేలా కృషి చేస్తామని హామినిచ్చారు.
ప్రెస్ కవరేజ్ కోసం పట్టణంలోని రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు, అధికారులు సంప్రదిం చాల్సిన ఫోన్ నంబ ర్స్: మొబగాపు ఆనంద్ కుమార్: 9550867087, పిల్లి రాజు: 944063109. దయచేసి సహక రిం చగలరు.











