భద్రాచలం, నేటిసూర్య న్యూస్: భద్రాచల పట్టణాన్ని మండలం గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం భద్రా చలం నియోజకవర్గం ఎంతో నష్టపోయిందని, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు భద్రాచలాన్ని అభివృద్ధి ఆమడ దూరంలో ఉంచిందని అన్నారు. అభి వృద్ధి విషయాన్ని పక్కన పెడితే ఒక గ్రామపంచా యతీగా ఉన్న భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయ తీలుగా విభజిస్తూ జీవో విడుదల చేసి భద్రాచల పట్టణాన్ని ముక్కలుగా విభజించే ప్రయత్నం చేశారని ,
ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మూడు పంచాయతీల జీవో కు వ్యతిరేకంగా ఆ జీవో రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను కోర్టును సైతం ఆశ్రయించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నియోజకవర్గంనీ అభివృద్ధి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేం దుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది అని ఈ జీవో ఒక ఉదాహరణ అని, ఈరోజు విడుదలైనటువంటి జీవోలో భద్రాచలాన్ని ఒకే మండలం గా, ఆ మండలం లో భద్రాచలం ఒకే గ్రామపం చాయతీగా ఉంచటం భద్రా చల ప్రజలందరూ ఎంతో ఆనందించదగ్గ విషయమని కొనియాడారు. భద్రాచల గ్రామానికి గ్రామపంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు జరిపేందుకు ఈ జీవో ద్వారా పరిష్కారం చూసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్య మంత్రివర్యులు భట్టి విక్రమా ర్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భద్రాచలం ప్రాంత సమస్యను సీఎం గారు దృష్టికి,మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్యను పరిష్కారం చూపే దిశగా నడిపించిన భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు , మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య గార్లకి ప్రత్యేకంగా ధన్యవా దాలు తెలిపారు.ఈ విషయం పై హర్షం వ్యక్తం చేసిన వారిలో భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి దొడ్డిపట్ల కోటేష్,బ్లక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, మాజీ గ్రంధాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్,ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,బీసీ సెల్ నాయకులు రాగం సుధాకర్,RG సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మగపు రాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.











