పిఓ డిడి లకు వినతి పత్రం అందించిన ఏఎన్ఎంలు.
భద్రాచలం ,నేటిసూర్య న్యూస్:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐటిడిఏ పరిధిలో గల ఆశ్రమ గిరిజన పాఠశాలలలో ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏఎన్ఎం 85 మంది సిబ్బందికి గత తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో బి రాహుల్ తోపాటు ఐటిడిఏ డిడి లకు వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ 2024 మార్చి నిండి ఏఎన్ఎం లకు వేతనాలు ఇవ్వనందున అనేక దఫాలుగా ఐటీడీఏ పీవో కి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు ఇచ్చిన ఇంతవరకు వారి వేతనాలు విడుదల కాలేదని అన్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరికీ నిధులు విడుదల చేస్తున్నామని ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగవని చెబుతున్నప్పటికీ గత ఎనిమిది నెలల నుండి గిరిజన విద్యార్థులకు సేవలు అందిస్తున్న ఏఎన్ఎం లకు మాత్రం జీతాలు విడుదల చేయడం లేదని ఈ నేపథ్యంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు అక్కడే మఖం ఉంటూ డ్యూటీలో 24 గంటలు విద్యార్థులకు వైద్య సౌకర్యాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఇంత సేవలందిస్తున్నప్పటికీ ఏఎన్ఎం లకు ఇంతవరకు వారి వేతనాలు విడుదల చేయకపోవడం చాలా దురదృష్టక మనీ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే వారి సమస్యలు పరిష్కరించే విధంగా మరియు వారి వేతనాలు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు, నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు వారి బాధలు అర్థం చేసుకొని తక్షణమే జీతాలను వారికి రావలసిన ఇతర సౌకర్యాలు కల్పిం చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎన్ఎంల సమస్యల పరిష్కారం కొరకు ఒక కమిటీని సైతం సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు 10 మందితో ఏర్పడ్డ ఈ కమిటీ సభ్యులుగా బి పద్మ, వి కౌసల్య ,ఏ సరిత , యు లక్ష్మి, వై సుధారాణి, జి కుమారి, బి శ్రావణి, ఎం స్వరూప ,టి శ్రావణి ,ఏ నాగమణి, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు











