ఇటీవల పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కరాటే పోటీల్లో మల్యాల ఆల్ఫోర్స్ ఎన్ఎస్వి విద్యార్థులు పతకాలు సాధించిన సందర్బంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిధిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని విజయాలను సాధించే విధానాలను తెలుసుకుంటారని తెలిపారు.ఎస్జిఎఫ్ క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ & జాబ్ లలో స్పోర్ట్స్ కోటా 2% రిజర్వేషన్ వర్తిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన క్రీడాకారులు అండర్ -17 & 14 కుమితే (ఫైట్) విభాగంలో పి అక్షయ, అఖిల్ బంగారు పథకాలు కైవసం చేసుకున్నారని కె అశ్వద్దామా,బి అక్షిత్,సాత్విక్,శశాంక్,రజత పథకాల్ని,ఎం షర్మిల,టి మనస్వి,శ్రీచరణ్ కాంస్య పథకాన్ని గెల్చుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు.ఈ సందర్బంగా పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.











