పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా. వాళ్ళు క్రిమినల్స్ కాదు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

 

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీలలో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి పథంలో ఉంచిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్ డిమాండ్ చేసారు.రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భంలో సర్పంచులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేయడాన్ని అయన తీవ్రంగా ఖండించరు. సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగులో ఉన్నాయని, బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలే శరణ్యం అని వాపోతున్నారని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్న ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. గాంధేయ మార్గంలో చేయతలపెట్టిన నిరసన దీక్షకు పోలీసులు అడుగడుగున అడ్డుతగిలి అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు.తక్షణమే బిల్లులు చెల్లించలని ఆయన డిమాండ్ చేసారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్