మల్యాల మండల వ్యాప్తంగా హడావిడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 20 రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.రిబ్బన్ కటింగ్ లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయ్యాయని బిజెపి కిసాన్ మోర్చా నాయకుడు పొనగంటి గౌతమ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతో కష్టపడి పండించిన పంట కొనడానికి ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు సరిగా లేనందున రోడ్డుపైన వడ్లు వర్షానికి తడుస్తున్నాయని రైతు పరిస్థితి అద్వానంగా మారిందని రోలు పోయి రోకలికి చెప్పుకున్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం వడ్లు కొనకపోతే రెండు రోజుల్లో బిజెపి పక్షాన ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Post Views: 36











