స్పీకర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఎస్సీ,ఎస్టి వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హైదరాబాదులో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈనెల నవంబరు 10 నా నిర్వహించే తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ మహాసభ కరపత్రాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్. పామేన భీమ్ భారత్,తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్, రాష్ట్ర కార్యదర్శి ఆరేల్లి మల్లేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీ మాల సాయిరాజ్,గుండ్ల కుమారస్వామి,ఎలా సంతోష్,తదితర జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్