సర్వేయర్‌ను నియమించాలని కలెక్టర్ ని కలసిన కొత్తపల్లి..

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల, సెప్టెంబర్ 21 ,నేటి సూర్య: చర్ల మండలంలో సర్వేయర్‌ లేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మండలానికి ప్రత్యేకంగా సర్వేయర్‌ను నియమించాలని రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను కలిసి రైతుల సమస్యలను వివరిస్తూ మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. చర్ల మండలంలో సర్వేయర్‌ లేకపోవడంతో భూ సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భూముల హద్దులు, సర్వేలు తదితర అంశాలపై స్పష్టత లేక అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని చర్ల మండలానికి వెంటనే సర్వేయర్‌ను నియమించాలని కోరారు. వెంటనే కలెక్టర్ అంకిత్ స్పందించి సర్వేర్ ను వెంటనే నియపిస్తానని హమీ‌ ఇచ్చారు.

రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సర్వేయర్ నియామకంతో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని కొత్తపల్లి ఆంజనేయులు అన్నారు. రైతుల పక్షాన తాను నిరంతరం సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్