శబరి బాలికలకు దుస్తుల పంపిణీ

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటిసూర్య ప్రతినిధి: 
విద్యతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చర్లలోని వనవాసీ శబరి బాలికా విద్యార్థి నిలయంలోని బాలికలకు వస్త్ర వ్యాపారి గుండెల రమేష్–రత్నకుమారి దంపతులు దుస్తులను పంపిణీ చేశారు. పండుగ సందర్భంగా బాలికలకు వస్త్రాలను అందజేయడం ద్వారా తమవంతు సహకారం అందించారు.
కొమరం భీం విద్యాలయంలో కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వనవాసీ తరఫున మొట్టమొదటి బాలికా విద్యార్థి నిలయాన్ని చర్లలో ప్రారంభించినట్లు తెలిపారు. గిరిజన విద్యార్థుల విద్య, సంక్షేమం, అభివృద్ధి కోసం వనవాసీ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు.
బాలికలకు సురక్షితమైన వాతావరణంలో విద్యనందించడంతో పాటు వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయాలనే ఉద్దేశంతో వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆశాలత తెలిపారు. ఇక్కడ లభిస్తున్న అవకాశాలను బాలికలు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల అవసరాలను గుర్తించి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తమవంతు సహాయం అందిస్తే మరెంతో మంది పేద, గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని అన్నారు.
కార్యక్రమంలో దాతలు గుండెల రమేష్–రత్నకుమారి దంపతులతో పాటు గోగికార్ రాంలక్ష్మణ్, వరలక్ష్మి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్