నేటి సూర్య ప్రతినిధి : చర్ల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే తన సమర్థ వంతమైన విధి నిర్వహణతో ప్రజల మన్ననలు పొందిన ఎస్సై కేశవ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసే కఠిన సేవా పథకం లభించడం హర్షణీయం.
చర్ల సీఐ రాజువర్మ ఆధ్వర్యంలో మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్సై కేశవ్ విశేష కృషి చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో చొరవ చూపడంతో పాటు నేర నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.అలాగే సీఐ రాజువర్మతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటూ పోలీస్ శాఖకు ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై సూచనలు, సలహాలు అందించారు. విధి నిర్వాహణ పట్ల అంకితభావం, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఎస్సై కేశవ్‌ను కఠిన సేవా పథకంకు ఎంపిక చేయడం చర్ల మండల ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలు, యువజన సంఘాల నాయకులు, ప్రజాప్రతి నిధులు, వివిధ వర్గాల ప్రజలు ఎస్సై కేశవ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.











