సమాజ సేవే అసలైన పండుగ అనే సందేశాన్ని చాటుతూ కొత్తపల్లి ఆంజనేయులు తన పుట్టినరోజును వినూత్నంగా నిర్వహించారు. ఆర్భాటాలకు దూరంగా ఉండి, దివ్యాంగులకు బియ్యం, కిరాణా సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు దివ్యాంగ కుటుంబాలను స్వయంగా కలుసుకుని వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవారికి తోడుగా నిలవడం ఆయన నైజం.
ఈ సందర్భంగా కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ, “నా జీవిత లక్ష్యం పేద, మధ్యతరగతి ప్రజలకు సేవ చేయడమే. పుట్టినరోజు అంటే కేవలం వేడుకలు కాదు… అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా నిజమైన ఆనందం లభిస్తుంది” అని అన్నారు. దివ్యాంగుల పట్ల ప్రేమ, బాధ్యతతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు.
స్థానిక ప్రజలు, యువకులు, స్నేహితులు ఆయన సేవా భావాన్ని అభినందిస్తూ, సమాజానికి ఉపయోగపడే విధంగా పుట్టినరోజును జరుపుకోవడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.











