తేగడలో ఘనంగా కళ్యాణ మహోత్సవం.
దంపతులకు ప్రత్యేక అవకాశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల పరిధిలోని తే గడ గ్రామంలో రేపు (సోమవారం) రాత్రి జరిగే కళ్యాణోత్సవం భక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయినట్లు ఆలయ అర్చకులు బాను ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి దేవస్థాన ప్రాంగణంలో కళ్యాణ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని పీటలపై కూర్చుని పూజా కార్యక్రమంలో భాగస్వా ములు కావాలనుకునే దంపతులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. ఆసక్తి గల దంపతులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం నంబర్‌ను9908900590 నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.
భక్తి, ఆధ్యాత్మికతతో నిండిన ఈ కార్యక్రమంలో పాల్గొని దైవ అనుగ్రహం పొందాలని గ్రామ పెద్దలు, నిర్వాహకులు భక్తులను ఆహ్వానిస్తున్నారు.










