సామాజిక ఉద్యమ కారుడు,డైనమిక్ లీడర్, ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్, జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి దయాకర్ పుట్టినరోజు సందర్భంగా చర్ల మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి దయాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు దయాకర్ సేవలను కొనియాడుతూ ఆయన నాయకత్వంలో సమాజ అభ్యున్నతి సాధ్యమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. పేదలు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, అద్దంకి దయాకర్ వంటి నాయకులు సమాజానికి మార్గదర్శకులని, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన కృషి కొనసాగించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోట మల్ల రమణ మూర్తి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, రాష్ట్ర నాయకులు తడికల లాలయ్య, కొంగురు రమణారావు, మండల గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్ రావు, నియోజకవర్గ అధ్యక్షులు కారంపూడి సాల్మన్, మండల నాయకులు కొంగూరు సత్యనారాయణ, తోటమల్ల కృష్ణారావు, ఇప్ప ప్రభుదాసు, మేడబత్తిని గోవర్ధన్, పరవ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.











