చదువులపై శ్రద్ధపెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలి…అరుణ కుమారి

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

విద్యార్థులు చదువులపై సంపూర్ణ దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అరుణ కుమారి అన్నారు. చర్ల మండలం పెద్దమిడిసిలేరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన ఆమె, విద్య అనేది భవిష్యత్తును నిర్మించే బలమైన ఆయుధమని తెలిపారు.చర్ల మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన తోకల దీక్షిత్–పార్వతి దంపతుల కుమార్తె దర్శిని జన్మదినాన్ని పురస్కరించుకుని, వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొమరం భీం విద్యార్థి నిలయానికి 50 కిలోల బియ్యం అందజేసి, విద్యార్థులకు భోజనం మరియు పండ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అరుణ కుమారి మాట్లాడారు. నిరుపేద గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం వసతిగృహాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఆమె తెలిపారు. అటవీ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారికి నాణ్యమైన విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను బోధించడం గొప్ప సేవగా అభివర్ణించారు. ఈ నిలయంలో విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని విన్నానని, అదే స్పూర్తితో చదువులో రాణించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.విద్యార్థులు ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా చదువులపై ఏకాగ్రత పెంచుకుంటే భవిష్యత్తు బంగారుమయ మవుతుందని సూచించారు. విద్య ద్వారా అనేక మంది జీవితాలు మారిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, అలాంటి విజయగాథలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రోత్సహించారు. నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ, దాతల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా విద్యార్థులు కష్టపడి చదవాలని కోరారు. తమ ప్రతిభతో సంస్థకు, తల్లిదండ్రులకు, ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకురా వాలనిసూచించారు. దేశవ్యా ప్తంగా వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో 442 విద్యార్థి నిలయాలు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఇవన్నీ దాతల సహకారంతో కొనసా గుతున్నాయని, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ వంతు కృషి కొనసాగు తుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో నిలయ కమిటీ ఉపాధ్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకు మారి, తోకల దీక్షిత్, పార్వతి, దర్శిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్