చర్లలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణకు సిద్ధం.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో రేపు(ఆదివారం) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ సీనియర్ నాయకుడు, రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు, ఎడారి సత్యనారాయణ లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ఆశయాలు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉన్నాయని, అదే దిశగా పార్టీ ఇప్పటికీ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

రేపు నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ, మహానేతల చిత్రపటాలకు పూలమాలలు అర్పించడం, కార్యకర్తల సమావేశం, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

చర్ల మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు,కార్యకర్తలు, NTR అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ఆవిర్భావ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని కొత్తపల్లి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఈ వేడుకను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్