చిన్న ఇంద్రకీలాద్రిపై శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి భక్తి కానుకలు సమర్పణ.
చర్ల లోని చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆవుల శివప్రసాద్ దంపతులు అమ్మవారిపై తమ విశ్వాసా న్ని చాటుతూ పట్టుచీర, పసుపు, కుంకుమ, గాజులను సమర్పించారు. వారు సమర్పించిన ఈ పవిత్ర కానుకలను ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ స్వీకరించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అమ్మవారికి పట్టుచీర సమర్పించడం హిందూ సంప్రదాయంలో విశేషమైనది. ఇది శుభ సూచకంగా భావించబడుతూ, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ భక్తులు ఈ విధమైన కానుకలను సమర్పిస్తారు. ముఖ్యంగా పసుపు, కుంకుమ, గాజులు స్త్రీ శక్తికి ప్రతీకలుగా భావించబడతాయి.
చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన ఈ అమ్మవారి ఆలయం ప్రాంత ప్రజలకు విశేష ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాలు భక్తులకు ఆత్మశాంతి కలిగిస్తున్నాయని భక్తల నమ్మకం.











