నేటిసూర్య ప్రతినిధి:
చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాదం శెట్టి నరసింహారావు–పద్మజ దంపతులు అమ్మవారిపై ఉన్న తమ భక్తిని వ్యక్తపరుస్తూ, పంచలోహాల ముక్కుపుడకతో పాటు అమ్మవారికి పెద్దహరం..చిన్నహరాన్ని సమర్పించారు.
ముందుగా ఆలయ పురోహితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రోచ్ఛారణల నడుమ ముక్కుపుడకను..హరాలను అమ్మవారికి అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి దివ్యదర్శనం పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు.
దాతృత్వం చూపిన గాదం శెట్టి నరసింహారావు–పద్మజ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఇలాంటి సేవలు మరింత మంది భక్తులకు స్ఫూర్తినిచ్చి, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని వారు ఆకాంక్షించారు.
Post Views: 14











