నేటిసూర్య ప్రతినిధి: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా చర్ల లో మానవత్వాన్ని చాటిచెప్పే సేవా కార్యక్రమం నిర్వహించబడింది. చర్లలో తిరుగుతూ జీవనం సాగిస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తికి స్థానిక యువకులు ముందుకు వచ్చి కొత్త బట్టలు అందజేసి తమ దయాగుణాన్ని చాటుకున్నారు.
శివరాజు కృష్ణ కిషోర్ పిలుపుతో మామిడి శ్యామ్, మాత పండు గార్లు కలిసి ఆ నిరాధార వ్యక్తిని గుర్తించి, ఆయనకు కొత్త దుస్తులు తొడిగించి, ఉగాది పండుగను సార్థకం చేశారు కిషోర్ . ఈ సందర్భంగా ఆ వ్యక్తికి ఆహారం కూడా అందజేసి, అతని పరిస్థితిని గమనించి సహానుభూతితో వ్యవహరించారు.
ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, పండుగల అసలు సారాంశం పరస్పర సహకారం, దయ, మానవత్వం అని అన్నరు. సమాజంలో ఉన్న నిరాధారులకు సహాయం చేయడం ద్వారా నిజమైన పండుగ ఆనందాన్ని పొందవచ్చని తెలిపారు.
స్థానిక ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి సేవా భావం కలిగిన యువత సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడం ద్వారా సమాజంలో ఐక్యత, మనోభావాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం చర్లలో ప్రత్యేకంగా నిలిచి, మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.











