నేటిసూర్య ప్రతినిధి : తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చర్ల లోని రాహుల్ విజ్ఞాన్ హాస్టల్‌లో నగారా ఉగాది సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. జవ్వాది రవి కుమార్, పలువురు నేతృత్వంలో మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయగా, స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చర్ల రైతు క్లబ్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి రామాంజనేయులు హాజరయ్యారు. పోటీలో పాల్గొన్న మహిళలు రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు. ముగ్గులలో వినూత్న రూపకల్పనలు, పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉండటంతో ముఖ్య అతిథి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఉగాది పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా మహిళల ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జవ్వాది రవికుమార్, మేడిచర్ల కుమార్, బద్రం, రాయుడు, సతీష్, టి.నరేష్, స్థానిక ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











