ఉగాది పర్వదినం సందర్భంగా చిన్న ఇంద్రకీలాద్రిలో మల్లి లార్చన…. ప్రత్యేక పూజలు

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల  లోని చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర ఆరంభమైన ఉగాది పర్వదినం సందర్భంగా 2026 మార్చి 19వ తేదీ గురువారం ఈ కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

ఉదయం 9 గంటల 30 నిమిషాలకు అమ్మవారికి మల్లెలతో ప్రత్యేక అలంకరణ (మల్లీ లార్చన) నిర్వహించబడుతుంది. అనంతరం దేవి ఖడ్గమాల అర్చనను ఘనంగా జరపనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షాన్ని పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ తెలిపారు.

అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు ప్రముఖ ప్రవచనకర్త తంగళ్ళపల్లి శంకరాచార్య గారి ఆధ్వర్యంలో అమ్మవారి సౌందర్య లహరి పారాయణం నిర్వహించబడుతుంది. ఈ పారాయణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించనుంది.

ఉగాది వంటి పవిత్రమైన పర్వదినం కావున భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి, ఆమె కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్