భక్తి భావంతో ప్రత్యేక పూజలు – దాతృత్వానికి కమిటీ అభినందనలు.
నేటి సూర్య ప్రతినిధి: ఈ నెల 19 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కనే తరతరాలుగా వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయానికి భక్తి భావంతో సంజీవిని ఆన్లైన్ సర్వీసెస్‌కు చెందిన సంగేపు భానుప్రియ – బీంరాజు దంపతులు రూ.10,200 విలువ గల టాటా వోల్టాస్ వాటర్ డిస్పెన్సర్‌ను విరాళంగా అందజేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు మరియు ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందజేసినట్లు వారు తెలిపారు.
అదేవిధంగా ఉగాది సందర్భంగా అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చి విరాళం అందించిన సంగేపు భానుప్రియ – బీంరాజు దంపతులను హృదయపూర్వకంగా అభినందించారు. వారికి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కమిటీ తరఫున ఆకాంక్షించారు.











