రాళ్లగూడెంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ప్రారంభం

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటి సూర్య ప్రతినిధి : చర్ల మండలం రాళ్లగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జాతర ప్రారంభంలో భాగంగా భక్తులు సమీప నది నుంచి 108 బిందెలతో పవిత్ర జలాలను తీసుకువచ్చి ముత్యాలమ్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా డప్పులు, మేళతాళాల నడుమ భక్తులు నదికి వెళ్లి పవిత్ర నీటిని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించారు.

జాతర సందర్భంగా రాబోయే రోజుల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్