త్రికూట దేవాలయంలో ప్రత్యేక పూజలు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటిసూర్య ప్రతినిధి : చర్ల గ్రామంలో ఉన్న త్రికూట దేవాలయంలో రాబోయే శ్రీ పరాభవ నామ నూతన తెలుగు సంవత్సరాది (ఉగాది) సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు త్రికూట దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా మార్చి 19, గురువారం ఉదయం 9 గంటలకు ఆలయంలో నారికేళాలకు ఎర్ర జాకెట్టు కట్టి, తొమ్మిది రకాల తోరములతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలో భాగంగా సిద్ధం చేసిన నారికేళాన్ని భక్తులు తమ వ్యాపార దుకాణాల ముందు లేదా ఇంటి ముందు ప్రతిష్ఠించుకుంటే నరగోష, శత్రుఘోష నివారణ కలిగి నవగ్రహ దోషాలు తొలగుతాయని ఆలయ పూజారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తుల నుండి ఒక్క నారికేళానికి రూ.150 రుసుము నిర్ణయించినట్లు దేవాలయ కమిటీ వెల్లడించింది. చర్ల గ్రామ ప్రజలు, భక్తులు ఈ పుణ్య కార్యక్రమాన్ని గమనించి అధిక సంఖ్యలో పాల్గొని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రికూట దేవాలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్