- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, లింగాపురం గ్రామానికి చెందిన మైపా నీలయ్య (58) పక్షవాతం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్న ఈ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మీ కోసం మేమున్నాం టీం ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి, పలువురు దాతల 7వేల రూపాయలను సేకరించి శుక్రవారం ఉదయం 11 గంటలకు చర్ల లోని మేమున్నాం కార్యాలయంలో దొడ్డి తాతారావు మాష్టారు చేతుల మీదుగా నీలయ్య కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.. ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలా ఓ చేయి వేసి సహాయమందిస్తే వారు ఎంతో స్వాంతన పడతారని, అలా చేయడం ఎంతో పెద్ద పుణ్యకార్యమని, ప్రతీ ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈ విధమైన సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో దొడ్డి సూరిబాబు, పంజా రాజు, కవ్వాల రాము, దొడ్డ ప్రభుదాస్, గాదెరాజు ప్రసాద్, మడిపల్లి ప్రవీణ్, దొడ్డి రామ్మోహన్, జట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…
Post Views: 8