భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

BRS పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు .

నేటి సూర్య ప్రతినిధి :

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని అందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు మణుగూరు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటికైనా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించే వారు, పెద్దలు, చిన్నలు అన్ని జాగ్రత్తలతో ఉండాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం సమయానికి స్పందించాలని కోరుతూ, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్