మట్టి చేతుల్లో…. దేశ ప్రేమ హృదయాల్లో… జేఐహెచ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

బూర్గంపాడు, జులై20, నేటిసూర్య న్యూస్: మట్టి, మొక్కలు చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో భారత దేశంలోని ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నారన్నారు. బూర్గంపాడు మండలం సారపాక జమాతె ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ సభ్యులు మాట్లాడుతూ… ముఖ్య ఉద్దేశంతో జమాతె ఇస్లామీ హింద్ పిల్లలతో సృజనాత్మకతకై ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. చిన్నారుల కోసం చిన్నారుల ద్వారా పెద్దల సంరక్షణలో నిర్వహించే ఈ కార్యక్రమం పిల్లల్లో ఇస్లామిక్ విలువలతో పాటు దేశ ప్రేమ దేశ సేవ సామాజిక విలువలతో పాటు దేశ చైతన్యం, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్ది వారి సంపూర్ణ సమగ్రాభివృద్ధికై తీర్చిదిద్దాలన్నారు. పిల్లల అభివృద్ధే లక్ష్యంగా జేఐహెచ్ ఒక మహత్తర మిషను “మట్టి చేతుల్లో… దేశ ప్రేమ హృదయాల్లో” అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని జూన్ 25 నుంచి జూలై 25వరకు ప్రారంభించిందన్నారు.

జమాతె ఇస్లామీ హింద్ లక్ష్యం :

10లక్షల మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతను చిన్నారులకు అప్పగించాలన్నారు. భారత దేశాన్ని ఆకు పచ్చగా ఆహ్లాదకరంగా మార్చడం, చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం ప్రకృతి పట్ల ప్రేమ పర్యావరణ సేవ బాధ్యత బాల్యము నుండే వెలువడాలని ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశమన్నారు. భూమిపై నిజమైన హీరోగా ఉండటానికి ఇది మనకు మంచి అవకాశం దీన్ని మనం ఎందుకు ప్రచారం చేస్తున్నామంటే…? భూమి వేడెక్కుతోంది. చెట్లు నరకటం, అడవులు తగ్గడం, స్వచ్ఛమైన గాలి తగినంత లేవు. మనలాంటి పిల్లలు మన భవిష్యత్తుకు కూడా సహాయం చేయగలరని జేఐహెచ్ నమ్ముతుంది. ఈ ఉద్యమంలో మనం చేసే పనులు మన పాఠశాలతోపాటు ఇంటి దగ్గర కూడా ఒక చెట్టును నాటాలన్నారు. ఇంకా మొక్కలు చెట్ల ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు పిల్లలకు వివరించారు. మనిషి ఈ ధరిత్రిపై అడుగు పెట్టకముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్ష జాతులతో అలంకరించాడు. మరికాసేపట్లో ఈ ప్రపంచం అంతమైపోతుందని తెలిసినప్పటికీ మీ చేతిలో మొక్క ఉండే దానిని నాటండన్నారు. నీడ వెచ్చే చెట్ల క్రింద మల మూత్రాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీసీ పీఎస్పిడి మహిళా వైద్యాధికారి అమృత జమాతె ఇస్లామీ హింద్ మహిళా సభ్యులు రుబినా, మసర్రత్, రఫత్, వాసిఫా, పర్వీన్ర, జియా బేగం, హాజీ బేగం, తస్లీమా బాను, సఫియా, కరిష్మా, జమాతె ఇస్లామి హింద్ సారపాక సభ్యులు జహీర్ పాషా, షేక్ అబ్దుల్ సలీం, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు జహూర్, సైదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్