చర్ల, నేటి సూర్య న్యూస్: గురుదేవ్ విద్యాలయంలో ఐఎల్ఎం బెంగళూరు వారిచే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయని హెచ్ఎం గిరి తెలిపారు. గురుదేవ్ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల్లో ఆంగ్లభాషలో చక్కని అవగాన కల్పించాలన్న సత్సంకల్పంతో, ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఎంతో వ్యయంతో కూడుకున్నదే అయినా కూడా ఐఎల్ఎం బెంగుళూరు వారితో ఒప్పందం కుదుర్చుకుని, ఐఎల్ఎం బెంగుళూరు వారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభించడమైనది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థినీ, విద్యార్థులకు చక్కని శిక్షణ ఇచ్చుటకు ఐఎల్ఎం బెంగుళూరు నుండి కుమారి సౌజన్య శిక్షకులుగా నియమించబడ్డారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్.జి.వి. ప్రసాద్, అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి. సుబ్రహ్మణ్యం, జి. శ్రీనివాస్ ఐఎల్ఎం బెంగుళూరు నుండి విచ్చేసిన సందీప్ చేతుల మీదుగా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించబడినది. ప్రధానోపాధ్యాయులు హెచ్.జి.వి. ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చుటకు ఎంతో సుదూరాల నుండి వచ్చేసిన కుమారి. సౌజన్యకు సందీప్ మన పాఠశాలకు తమ సహకారాన్ని అందిస్తున్న ఐఎల్ఎం బెంగుళూరు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
