వాహనదారులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవు.
ఎస్ఐ రాజకుమార్
నేటిసూర్య ప్రతినిధి:
వాహనాల రద్దీ అధికంగా ఉన్న ప్రదేశాలలో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపితే కేసులు నమోదు చేస్తామని ఈ బయ్యారం ఎస్ఐ రాజకుమార్ అన్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ , జానంపేట వంటి రద్దీ కూడలి లో వాహనాలు రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. వాహనదారులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. దుకాణదారులు సైతం సహకరించాలని కోరారు. ఆటోలలో, మ్యాజిక్ రవాణా సాధనాలలో పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు అని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.
Post Views: 44