చర్ల ,నేటిసూర్య న్యూస్: పీఆర్టీయు సంఘ పక్షాన పలుమార్లు ఇచ్చిన ప్రాతినిధ్యం మేరకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గాను మంగళవారం రూ.700కోట్లు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయు సంఘ కృషి మేరకు ప్రభుత్వం నిధుల విడుదల చేసిందని చర్ల మండల శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పులగం దామోదర్ రెడ్డిలు ముఖ్యంగా రూ.270కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపునకు గాను కేటాయించగా ఇప్పటికే జిల్లాల వారీగా మెడికల్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన నిధులతో పెండింగ్ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్, తుది చెల్లింపులు, వేతన బకాయిల చెల్లింపు కూడ జరగనుంది. పెండింగ్ బిల్లుల సాధనలో ప్రభుత్వాన్ని ఒప్పించి నిధుల విడుదలకై అవిరామ కృషితో శ్రమిస్తూ ఉన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గుండు లక్ష్మణ్, పులగం దామోదర్ రెడ్డిలకు చర్ల మండల శాఖ కృతజ్ఞతలు తెలిపిన వారిలో మండల అధ్యక్షులు ఎస్ఎస్ఎస్. రవి కుమార్, ప్రధాన కార్యదర్శి వీరభద్రం, రాష్ట్ర జిల్లా కార్యదర్శులు వేణు, శ్రీనివాస్ గురుమూర్తి, కేహెచ్ కేఎస్ ఎన్. రాజు, వైవి. రాజు, పున్నం సారయ్య, మీడియం రామకృష్ణ, రామయ్య ఉన్నారు.
