బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్ : గోదావరి పరివాహక ప్రాంతమైనా కూడా నీళ్ల కోసం తహ తహలాడుతున్నారు ఇక్కడి ప్రజలు… ఇదెలా ఉందంటే గోదావరి పక్కనే ఉన్నా బిందెడు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అధికారులతో ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా… పలు మార్లు ప్రత్యక్షంగా కలిసి విన్నవించినా వారికి చీమ కుట్టినట్టు కూడా లేనట్టుంది ఇక్కడి అధికారుల వ్యవహారం శైలి. వివరాల్లోకి వెళితే…బూర్గంపాడు మండలం, సారపాక పంచాయతి పరిదిలోని గాంధీనగర్ పుల్లయ్య క్యాంపులో గవర్నమెంట్ స్కూల్ లైన్ నుంచి స్టోర్ దాకా ఉన్న పైపు లైన్ ద్వారా గత ఆరు నెలల నుంచి వాటర్ రావడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు ఫిర్యాదులు చేసి కూడా మూడు నెలలవుతున్నా స్పందన కరువైంది. అంతకు ముందు ఈ విషయమై ఈవోకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చేస్తాం… చూస్తాం అని సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారని ప్రజలు మండి పడుతున్నారు. ఏది ఏమైనా ఆరు నెలల నుంచి ఈ సమస్య ప్రజలను పట్టి పీడిస్తోన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి మేజర్ సమస్యను పరిష్కారం చూపకుండా గాలికొదిలేస్తున్న సంబంధిత పంచాయతీలో సారపాక ఈవో ఉన్నట్టా… లేనట్టా… అనే అనుమానాలు ఇక్కడి ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు.
