నేటిసూర్య ప్రతినిధి:
భద్రాచలం పట్టణంలోని ఏషియన్ ఉదయ భాస్కర్ సినిమా హాల్ లో సమస్యలు తాండవిస్తున్నాయని సినిమా ప్రేక్షకులు శనివారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సినిమా థియేటర్లో అసౌకర్యాల నడుమ థియేటర్ నిర్వహణ ఉందని, పేరుకు మాత్రమే ఏసీ, లోపలికి పోతే ఉక్కపోతే అంటూ సినిమా ప్రేక్షకులు మండిపడ్డారు. ఎటువంటి సౌకర్యాలు లేకుండా ప్రేక్షకులను దోచుకుంటున్న యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ కార్యాలయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డొంకన చంద్రశేఖర్ మాట్లాడుతూ… తాను కుటుంబ సభ్యులతో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని సినిమా థియేటర్ కి వెళ్లగా థియేటర్లో ఏసీ పనిచేయదు, సరైన ఫ్యాన్లు లేవు చెప్పుకోవటానికే సిగ్గు చేటుగా ఉందని, ఇలాంటి థియేటర్ కి ఎందుకు వచ్చానా అని బాధపడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మూత్రశాలలు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు, కలక్షన్లు ఏసీలకు తీసుకుంటున్నారు ప్రేక్షకులకు ఉడకపోతలో సినిమాలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసౌక్యరాలు నడుమ థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులను దోచుకుంటున్న వైనంపై సిబ్బందిని ప్రశ్నించగా దురసు ప్రవర్తనతో ప్రేక్షకులతో హేళనగా మాట్లాడారని ఆవేదన చెందారు. ఇటువంటి థియేటర్ నిర్వహణ చేస్తున్న యజమాన్యంపై చర్యలు తీసుకొనుటకు సంబంధిత అధికారులు స్పందించి ప్రేక్షకులకు న్యాయం చేయాలని తెలిపారు ప్రేక్షకులకు న్యాయం జరిగే వరకూ, థియేటర్లో సౌకర్యాలు కల్పించే అంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామెర ఆదినారాయణ, ఎడారి రమేష్ పి. రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.