అదరగొట్టిన గురుదేవ్ విద్యా కుసుమాలు
100% ఉత్తీర్ణతతో మండలంలోనే ప్రత్యేక స్థానం
చర్ల , నేటిసూర్య న్యూస్:
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ విద్యా సంస్థలో చదివించాలని కోరుకుంటారు… అలాంటి విద్యాలయంలో తమ పిల్లలు చదివితే తప్పకుండ ప్రయోజకులవుతారనీ గట్టిగా నమ్మే విద్యాలయమే గురుదేవ్ అని చెప్పక తప్పదు. అలాంటిదే బుధవారం వెల్లడైన పది పరీక్ష ఫలితాల్లో మరొకసారి రుజువైంది. చర్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యాలయం ఇదేనని ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. మన గురుదేవ్ విద్యాలయం చర్లలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. 53మంది విద్యార్థులకు గాను 53మంది ఉతీర్ణులవడమే గాక అందరూ ఫస్ట్ క్లాస్ లో పాసవ్వడం అనేది అరుదైన ఘనత అనే చెప్పాలి. చెన్నదేవి భవ్యశ్రీ 600మార్కులకు గాను 557మార్కులు సాధించి ప్రథమ స్థానంలోనూ, కంచర్ల. అమృత 541 మార్కులతో ద్వితీయ స్థానంలో, కరుకు. ఉదయశ్రీ 533 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 12మంది. 400కి పైగా మార్కులు సాధించిన వారు 39మంది విద్యార్థులు. 360కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు. ఇంతటి ఘన విజయాన్ని సాధించడంలో కృషిచేసిన పదవ తరగతి ఉపాధ్యాయులను, తమ అకుంఠిత దీక్షతో శ్రమించి ఫలితాలను సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను, నిరంతరం తమ సహకారాన్ని, తోడ్పాటును అందించిన విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయులు హెచ్ గిరి ప్రసాద్, అకాడమిక్ కో-ఆర్డినేటర్స్ ఎంవీ. సుబ్రహ్మణ్యం, జి. శ్రీనివాస్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హెచ్ గిరిప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వెలువడిన ఫలితాలలో మా పాఠశాల గుణాత్మక ఫలితాలు నాణ్యమైన విద్యా బోధన ఒత్తిడి లేని చదువు పాఠశాల యాజమాన్యం నిరంతర పర్యవేక్షణ టీచర్స్ పటిష్టమైన విద్యా ప్రణాళిక విద్యార్థుల కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం వలన ఈ విజయం సాధించామన్నారు ఈ విజయాలు విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల మా బాధ్యతను మరింత పెంచాయన్నారు .