అంబేద్కరిజం విచ్ఛిన్నానికే మనువాద శక్తుల యత్నం… ప్రాథమిక హక్కులకు తూట్లు పొడుస్తున్నారు.

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

అంబేద్కరిజం విచ్ఛిన్నానికే మనువాద శక్తుల యత్నం
ప్రాథమిక హక్కులకు తూట్లు పొడుస్తున్నారు.
రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా ఏకం కావాలి…
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్

చర్ల, నేటిసూర్య న్యూస్ : దేశంలో మనువాదం కోసం అంబేద్కర్ వాదాన్ని విచ్ఛిన్నం చేయడానికి మనువాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దీన్ని జాతీయ మాల మహానాడు కార్యకర్తలు తిప్పి కొట్టాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి నుధాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం లింగావురంలోని జాతీయ మాల మహానాడు నేత కొంగూరు సత్యనారాయణ ఇంట్లో ఆయన రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కరిజంపై జరిగే దాడిని ఎదుర్కొంటూ, భారత రాజ్యాంగ రక్షణే అంతిమ లక్ష్యంగా అందరూ ఏకమై అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ప్రాథమిక హక్కులకు తూట్లు పొడిచి అస్థిరతకు బాటలు వేస్తున్నారని, రాజ్యాంగంలోనే మన హక్కుల పేజీని ఒక్కొక్కటిగా చింపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వాదులు రాజ్యాంగ రక్షణే అంతిమ లక్ష్యంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి తండ్రి అయిన మాల మహానాడు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎడెల్లి చంద్రం స్వగృహానికి వెళ్లి ఆయన్ను పరామర్శించి ఆరోగ్య వరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి జిల్లా ఇన్ ఛార్జ్ అసాద భాస్కర్, జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, జిల్లా సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ బోళ్ల వినోద్, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు బోడ దివ్య కార్యదర్శి మద్దేటి జయ, చర్ల మండల అధ్యక్షులు తోటమళ్ల గోపాలరావు, ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు కాలే పుల్లయ్య కొత్తగూడెం నియోజకవర్గ సీనియర్ నాయకులు గుడివాడ రాము, దానరి అశోక్, కొత్తగూడెం మాజీ ఎంపీటీసీ రెండెం రాము, భద్రాచలం నియోజకవర్గ సీనియర్ నాయకులు కారంపూడి సాల్మన్, తోటమళ్ల విజయరావు, కొంగూరు సత్యనారాయణ, తోటమళ్ల వరప్రసాద్, బూర్గంపాడు నియోజకవర్గ నాయకులు పల్లంటి హరీష్, కూరపాటి దాన్, బొజ్జ వెంకటేశ్వర్లు, సెనగ సాంబశివరావు, బర్ల చింటు, బోళ్ల నాగేశ్వరరావు. బిల్లా రవి. గుడిపిటి సంతోష్, జిల్లా యువజన సంఘం నాయకులు మెల్లం పురుషోత్తం, ఉండేటి శ్రుజన్, మహబూబాబాద్ జిల్లా నాయకులు వెంకటాద్రి, చిన్న హరి, చర్ల మండల నాయకులు కొంగూరు ప్రదీప్, తదికల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్