కాంగ్రెస్ పార్టీ తోనే బీసీ లకు న్యాయం జరుగుతుంది.
భద్రాచలం నియోజకవర్గం టీపీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్
నేటిసూర్య ప్రతినిధి:
తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు నేడు చారిత్రాత్మక మైన రోజు.. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నిరూపితమైందని భద్రాచలం నియోజక వర్గం టీపీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ అన్నారు. ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో కాంగ్రెస్ పార్టీయే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని మరోసారి రుజువయ్యిందని ఆయన అన్నారు..సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పడానికి బీసీ రిజర్వేషన్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టడమే దీనికి నిదర్శనం అన్నారు. బీసీ బిల్లును ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మరియు మంత్రి ఉతం కుమార్ రెడ్డి కి, రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి సహచర మంత్రివర్గానికి టీపీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు.