చర్ల , నేటిసూర్య న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాత.. బంగారు తెలంగాణ నిర్మాత.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత.. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ అయినవోలు పవన్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు ,పళ్ళు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ తెలంగాణ జల ప్రదాత కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా నిలిచారన్నారు. ఉద్యమ కాలమైనా పరిపాలనా ప్రస్తానమైన సమర్థ నాయకత్వానికి చిరునామాగా తెలంగాణ ప్రజానీకానికి అసలైన ధీమా అని .. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
