చర్ల, నవంబర్ 17, నేటి సూర్య న్యూస్:
మీకోసం మేమున్నాం టీం నిర్వహి స్తున్న వారాంతపు అన్న దానం కార్యక్రమం 155 వ వారానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా…. కీర్తిశేషులు శ్రీమతి మునగాల సీతా కుమారి గారి సంవత్సరీకం సంధర్భంగా వారి కుమారులు మునగాల కృష్ణ ప్రసాద్ & బ్రదర్స్ అందించిన వితరణతో ఆదివారం మధ్యాహ్నం 12.30 కు చర్ల గాంధీబొమ్మ సెంటర్ వద్ద సుమారు 300 మందికి ఉచిత భోజనాలు పెట్టడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతీ ఆదివారం సంతకు వచ్చే పేదవారి ఆకలి తీర్చడానికి గత 155 వారాలుగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని, ఇలానే మున్ముందు కూడా నిర్విఘ్నంగా జరపడానికి మిత్రులందరూ సహకరిం చాలని కోరారు. అలాగే ఈ వారాంతపు అన్నదానం కార్యక్రమానికి అరటిపండ్లు వితరణగా పంపిన బళ్లారి రవి, వెజిటబుల్స్ షాప్ అందించారు. పెరుగు బకెట్ లను చింతలపూడి రాంబాబు దంపతులు అందజేశారు. కార్యక్రమంలో ముమ్మనేని అరవింద్,దొడ్డి రమణారావు కొంగూరు నర్సింహారావు, దొడ్డి సూరిబాబు, ఉమ్మలేటి మల్లికార్జునరావు, సొల్లంగి నాగేశ్వరరావు, వరికల శ్రీను, భద్రం, పరిశుద్దం తదితరులు పాల్గొన్నారు.