గురుకులాల్లో మిగిలిన పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ పద్ధతిలో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో మిగిలిన పోస్టులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు వెంటనే అన్ని పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్‌ను, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని సూచించింది. తదుపరి చేపట్టే విచారణలోగా ప్రతివాదలు అందుకు సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.

కాగా, గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, పీజీటీ, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్లు తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆ నియామకాల్లో ఎగువ, దిగువ భర్తీ చేయాల్సి ఉన్నా అన్నింటికీ ఒకేసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఒకేసారి మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోవడంత మిగిలిన పోస్టులు భర్తీ కాకుండా అలాగే మిగిలిపోయాయి. దీంతో అలా మిగిలిపోయిన పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని కొరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్