క్రికెటర్లకు తగిన గౌరవం ఇవ్వాలి.. సోనూ సూద్

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

ఐపీఎల్ 2024లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీనే కారణమని ఆరోపణలు, విమర్శలు, ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించాడు.
క్రికెటర్లకు తగిన గౌరవం ఇవ్వాలని సోనూ ట్వీట్ చేశాడు. గెలిచిన రోజు పొగిడి, ఓడిన రోజు తిట్టడం సరికాదని చెప్పాడు.
ఫెయిల్ అయ్యేది ప్లేయర్స్ కాదని.. వాళ్ళను నిరుత్సాహపరిచేలా వ్యవహరంచే మనమే అని ఫ్యాన్స్‌కి హితబోధ చేశాడు. మన దేశం కోసం ఆడుతున్న ప్రతి ఒక్క ఆటగాడిని తాను ప్రేమిస్తానని.. అది కెప్టెన్ అయినా ఎక్స్ట్రా ప్లేయర్ అయినా ఒకేలా గౌరవించడం నేర్చుకోవాలని ట్వీట్ చేశాడు.

ఐపీఎల్ 2024లో జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ టీమ్ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోగా, హైదరాబాదుతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్