చిరంజీవిని నా తమ్ముడిగా అసలు ఊహించుకోలేను.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

టాలీవుడ్‌లో ఎంతమంది నటినటుల ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎవరికివారు తమదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు వచ్చిన సీనియర్ హీరోయిన్లలో సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ, అమలా ఇలా అందరు ఒకే తరం హీరోయిన్స్ అయినా..

వారందరిది డిఫరెంట్ స్టైల్. ముగ్గురు వైవిధ్యమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పరంగా కొందరు దూసుకుపోతుంటే.. హోమ్లీ రోల్స్ లో మరికొందరు ఆకట్టుకుంటారు. అలా 90వ దశంలో హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆమని ఒకటి.

 

జంబలకడిపంబ, శుభలగ్నం, మావిచిగురు, మిస్టర్ పెళ్ళాం లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఆమె కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఆమని కెరీర్ లో ఓ లోటు మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయిందట. తన డ్రీం హీరో మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ ఆమెకి రాలేదని చెప్పుకొచ్చింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన ఆమని మాట్లాడుతూ.. చిరంజీవితో నటించే ఛాన్స్ రాలేదని. అయితే రాకరాక నటించే ఛాన్స్ వస్తే అది కాస్త లాస్ట్ మినిట్‌లో మరో హీరోయిన్ వల్ల చేజారిపోయిందని చెప్పుకొచ్చింది. రిక్షావోడు సినిమాలో ముందుగా నన్ను సెలెక్ట్ చేశారని.. ఆ సినిమాలో నా బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య కూడా హీరోయిన్.

 

దీంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ సడన్గా ఒక రోజు పేపర్లో నగ్మాని హీరోయిన్గా సెలెక్ట్ చేశారని చదివా. మా మేనేజర్ ని అడిగితే అవును మేడమ్ మనకి ఛాన్స్ రాలేదు.. డైరెక్టర్ మారడంతో నగ్మాను హీరోయిన్గా తీసుకున్నారు అంటూ వివరించాడు. ఈ సినిమాకి ముందుగా కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేయాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన మరో సినిమాకి వెళ్లడం ఇంత కోడి రామకృష్ణ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది.. అలా చిరుతో నటించే ఛాన్స్ మిస్ అయిందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఛాన్స్ మిస్ అవ్వడం వల్ల నేను చాలా బాధపడ్డానని. నాకు హార్ట్ బ్రేకింగ్ లా జరిగిందని. ఆ గాయాన్ని మరి అవకాశం రీప్లేస్ చేయలేదని చెప్పుకొచ్చింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్