నేటిసూర్య ప్రతినిధి: ఈరోజు అనగా 06-03-26 శుక్రవారం సందర్భంగా చర్ల లోని MPDO ఆఫీస్ ఎదురుగా గల చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనక దుర్గమ్మ అమ్మవారి సన్నిధానంలో సాయంత్రం ప్రత్యేక పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ సందర్భంగా
వినాయక పంచరత్నం పారాయణం
కనకధార స్తోత్ర పారాయణం
అన్నపూర్ణ దేవి స్తోత్ర పారాయణం
అపరాధ క్షమాపణ స్తోత్ర పారాయణం
భక్తిశ్రద్ధలతో నిర్వహించబడనున్నాయి.
కావున భక్త ప్రజానీకం అధిక సంఖ్యలో హాజరై పారాయణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, దుర్గమ్మ తల్లి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
Post Views: 6










