నేటిసూర్య ప్రతినిధి: చర్లలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శనివారం పాఠశాల ప్రధానో పాధ్యాయు వర్మరాజు ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు సైన్స్ విశిష్టతను, జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రాముఖ్యతను, రామన్ ఫలితాన్ని విద్యార్థులకు వివరించారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు సి.వి.రామన్, ఏపిజే అబ్దుల్ కలాం, సర్ ఐసాక్ న్యూటన్,లూయి పాశ్చర్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, జగదీష్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజన్,మేడం క్యూరీ తదితర వేషధారణలో ఉన్న శాస్త్రవేత్తల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటిగా వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు.విద్యార్థులు వారిలో ప్రతిభను కనబరిచి ప్రాజెక్టులు చేయడంతో విద్యార్థులను, వారికి సహకరిస్తూ, ప్రోత్సాహం అందిస్తున్న సైన్స్ ఉపాధ్యాయులను పాఠశాల చైర్మన్ డాక్టర్ డి.ఎన్ కుమార్, డాక్టర్ ప్రతిభ, ఈడి టీవీపీసీ శాస్త్రి, ప్రిన్సిపాల్ వర్మ రాజు, తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.వి.ఎల్ నరసింహారావు, సైన్స్ ఉపాధ్యాయులు షేక్ ఉస్మాన్, అద్దంకి బోస్ బాబు, బిట్రగుంట క్రాంతి కుమార్, ఎం సునీత, ఆవుల జ్యోతి, సంగీత ,సౌజన్య,సంధ్య,చైతన్య తదితర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు










