రాహుల్ విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటి సూర్య ప్రతినిధి : చర్ల మండల కేంద్రం లోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తుగా సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను, పండుగ విశేషాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. అలాగే రాహుల్ విద్యాలయం మహిళా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థినీ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహిం చారు.ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అదే విధంగా మహిళా ఉపాధ్యాయులు అందరూ సంక్రాంతి సంప్రదాయ వంటకాలు అయిన అరిసెలు, చక్కర పొంగలి ఎంతో ఉత్సాహంగా పాఠశాల ప్రాంగణంలో తయారుచేసి సంబరాలు జరుపుకున్నారు..సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుండి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ముందస్తుగా వేడుకలు నిర్వహించడం జరిగింది… ఈ వేడుకలలో ఉత్సాహం గా పాల్గొన్న విద్యార్ధిని విద్యార్థుల ను,ఉపాధ్యాయులను పాఠశాల చైర్మన్ డాక్టర్ డి. ఎన్ కుమార్, డాక్టర్ ప్రతిభ, పాఠశాల ఈడి టివిపిసి శాస్త్రి, కొసరాజు హరి చరణ్ ప్రధానోపాధ్యాయులు వర్మ రాజు, ఏం వి ఎల్ నరసింహ రావులు అభినందించారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్