నేటిసూర్య ప్రతినిధి: సర్వేంద్రియానం నయనం ప్రధానం” అంటే, అన్ని ఇంద్రియాలలో (చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ) కళ్ళు అత్యంత ముఖ్యమైనవి అని అర్థం, ఎందుకంటే మనకు లభించే సమాచారంలో ఎక్కువ భాగం కళ్ళ ద్వారానే వస్తుంది, ఇవి మనకు ప్రపంచాన్ని చూడటానికి, జ్ఞానాన్ని పొందడానికి, మిగతా ఇంద్రియాలకు మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ సూక్తి కంటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను, దానిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఇంతటి శ్రేష్ఠమైన దానికి ఉచితంగా వైద్యం చేయడమంటే గొప్ప విషయమే అని చెప్పాలి. గురువారం నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ చర్ల హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు కంటి వైద్య నిపుణులు డాక్టర్ కే. లక్ష్మణరావు (డీఏఓ), హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమణారావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ చర్ల హెల్పింగ్ హ్యాండ్స్ రూపొందించిన ఉచిత కంటి పరీక్ష నిరంతర కార్యక్రమంలో భాగంగా చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 55మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయంచుకున్న వారిలో 10మంది విద్యార్థులకు కళ్ల అద్దాలు అవసరమున్నందున వారికి వారం రోజుల్లోఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షు, కార్యదర్శులు లయన్ నాగ కిరణ్, ఆవుల శివ ప్రసాద్ లు మాట్లాడుతూ ప్రస్తుతం నేటి సమాజంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు అలవాటు పడి తమ కంటిచూపును సైతం కోల్పోతున్నా సంఘటనలు కోకొల్లలు.. అందుకోసమే లయన్స్ క్లబ్ చర్ల హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆద్వర్యంలో చర్ల మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒక పాఠశాల చొప్పున విద్యార్థులకు కంటి పరిక్షలు నిర్వహింస్తున్నామని, అవసర మైన వారికి కళ్ల అదాలను ఉచితంగా అందజేస్తున్నామని అ న్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ నాగ కిరణ్ గుబ్బా,కార్యదర్శి ఆవుల శివ పసాద్, సుధాకర్, ఆనంద్, సీనియర్ జర్నలిస్టు లక్ష్మీనారాయణ , సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.










