లేడీ పర్స్ ను ఓట్లతో నింపండి…
పూజారి సామ్రాజ్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించండి…
ఈ నెల 11న జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో తన ఎన్నికల గుర్తయిన “లేడీ పర్స్”ను ఓట్లతో నింపాలని… తనను గెలిపించి సర్పంచ్ అభ్యర్థి పూజారి సామ్రాజ్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున తనను ఎన్నుకుంటే పంచాయతీ పరిధిలోని అర్హులందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసానిచ్చారు. రైస్ పేట వద్ద నుండి – పాతచర్ల వరకు గల ప్రధాన రహదారులపై డివైడర్ ఏర్పాటు చేసి అందమైన చర్లగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలోని ప్రతి రహదారిలో సిమెంట్ రోడ్డు నిర్మిస్తానని, కోతులు, కుక్కల బెడదను తొలగిస్తా, రహదారులపై చేసి ఇబ్బందులు పెడుతున్న పశువులను రోడ్లపై సంచరించకుండా తగు చర్యలు చేపడతానని భరోసానిచ్చారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ ఫించన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషిచేస్తానని తెలిపారు. డ్రైన్ల నిర్వహణను బాధ్యతతో చేపట్టి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ దోమల నివారణకు చర్యలు చేపడతారు. ఇంటింటి నల్లాలను ఏర్పాటుచేసి త్రాగునీటిని అందచేస్తానని, ఇప్పటికే సంత పాకల సమయదాయంలో నిర్మిస్తున్మ ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి నీటి ఎద్దడి ఉన్న గృహాలకు అందచేస్తానని, గుంతలమయంగా మారిన రహదారులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టి ఇబ్బందులను తొలగిస్తానని వాగ్దానం చేశారు. కావున విజ్ఞులైన ఓటర్లు “లేడీ పర్స్” గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.











