ఎవరు పోటీ చేసినా వార్ వన్ సైడ్… గెలిచేది చందు నాయకే..

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

గెలుపు బరిలో ముందు… హ్యాట్రిక్ రేసులో చందు

ప్రజాభిమానమే ఆయనకు దీవేనలు

నేటిసూర్య ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్ బరిలో ధరావత్ చందు నాయక్ ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ రేసులో ముందుండాలనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాటు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రచారం గట్టిగా చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతూ, చందు నాయక్ బరిలో ఉంటే ప్రతిపక్ష పార్టీలలో గుండెల్లో రైళ్లు పరుగెట్టి స్తున్నారు. ధరావత్ చందు నాయక్ పై ప్రజానీకానికి ఉన్న నమ్మకంతో గెలుపు ఒక్కడికే సాధ్యమం టున్నారు సారపాక ఓటర్లు. ఎవరెన్ని హామీలిచ్చినా… మాయ మాటలు చెప్పినా ప్రజల హృదయాల్లో వారి తండ్రి ప్రజలకు చేసిన సేవలు దగ్గర నుండి అదే బాటలో నడుస్తున్న తండ్రికి తగ్గ తనయుడిగా వారిపై ఉన్న అభిమానాన్ని ఆయనకు గల సేవా గుణాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. అందువల్ల పూర్తి భరోసాతో సింగిల్ గా వచ్చి సర్పంచ్ సీటు దక్కించుకుంటారని చందు నాయక్ అభిమానులు, మద్దతుదారులు అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చందు నాయక్ ప్రచారంలో పాల్గొన్న స్థానిక ప్రజలను చూసి నివ్వెరపోతున్నారు. ఇంతటి ప్రజాదరణ ఉన్న సర్పంచిగా గెలుపు మూడోసారి కూడా ఖాయమంటూ సర్పంచ్ కుర్చీని కైవసం చేసుకుంటాడని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్