37 మంది మావోయిస్టులు లొంగుబాటు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చత్తీస్‌గఢ్ రాష్ట్రం, దంతెవాడ జిల్లా కేంద్రంలో డిఐజి రాకేష్ చౌదరి, ఎస్పీ గౌరవ్ రాయ్ ముందు ఆదివారం రివార్డు కలిగిన 27 మంది మావోయిస్టులతో సహా 37 మంది జనజీవన స్రవంతిలో కలవడానికి డీఐజీ కార్యాలయంలో  డి ఐ జి రాకేష్ చౌదరి, ఎస్పీ గౌరవ రాయ్ ఇతర అధికారుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 8 లక్షల రివార్డు కలిగిన కుమ్లి అలియాస్ అనిత, గీత ఎలియాస్ లక్ష్మి, రంజన్ ఏలి యాస్ సోమ, భీమి ఏలియాస్ జహాజ్ అనే నలుగురు మహిళలు ఉన్నారు. ప్లాటోన్, ఏరియా కమిటీలతో సంబంధం కలిగి ఉన్నారు. వీరిలో చాలామంది 2024 గోబెల్, తులతులి ఎన్కౌంటర్లో, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కాల్పులు, దోపిడీలతో సంబంధం ఉందన్నారు. లొంగిపోయిన వారందరికీ తక్షణ సాయం కింద 50 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు, నైపుణ్య శిక్షణ, వ్యవసాయ భూమి మొదలైన అందుతాయని డీఐజీ పేర్కొన్నారు. డి ఆర్ జి, బాస్తరు ఫైటర్స్,, 80,111,230, సిఆర్పిఎఫ్ బెటాలియన్ల జవాన్ల సహకారం తో ఈ లొంగబాట్లు జరిగాయని ఎస్పీ గౌరవరాయ్ తెలిపారు. గత 20 నెలల్లో దంతివాడలో 58 మంది మావోయిస్టులు లొంగిపోయారని వారిలో 165 మంది రివార్డు కలిగిన వారు ఉన్నారని తెలిపారు. లోను వర్రాటు ప్రచారం కింద 333 మంది రివార్డు కలిగిన వారు ఉన్నారని, అలాగే 1160 మంది లో 916 మంది పురుషులు,244 మహిళలు ప్రధాన స్రవంతిలో కలిశారని తెలిపారు. ప్రత్యేక ఐజి సుందర్ రాజ్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసల వీడి శాంతిని స్వీకరించాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్