ప్రణీత్ విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర అమోఘం
పాద పూజ సన్మాన కార్యక్రమంలో హెచ్ఎం గిరి
చర్ల, నేటిసూర్య న్యూస్ : లక్ష్యం అనేది ఉంటే అది ఎప్పటికైనా ఎంత కష్టమైనా సాధించవచ్చు అని ప్రణీత్ ని చూసి నేర్చుకోవచ్చని హెచ్.జి.వి. ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం గురుదేవ్ విద్యాలయంలో పదవ తరగతి చదివిన విద్యార్థి పానుగంటి రామ్మోహన్, సామ్రాజ్యం కుమారుడు పీవీ. ప్రణీత్ తన ప్రతిభతో ఎంబీబీఎస్ లో సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో సీటు సంపాదించినందుకు గాను అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రణీత్ చేత వారి తల్లిదండ్రులకు పాదపూజ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హెచ్.జి.వి ప్రసాద్ మాట్లాడుతూ…. ప్రణీత్ సక్సెస్ కోసం ఎన్నో వ్యయ, ప్రయాసాలను ఎదుర్కొన్న అతని తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా నడుచుకుంటూ చక్కగా చదువుకోవాలని తెలియజేశారు. ఇందులో భాగంగా అకడమిక్ కో-ఆర్డినేటర్స్ ఎంవీ. సుబ్రహ్మణ్యం, జి. శ్రీనివాస్, విద్యార్థి పానుగంటి ప్రణీత్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పానుగంటి రామ్మోహన్ బాల్య మిత్రులు, బంధువులు, ఉపాధ్యాయ బృందం ప్రణీత్ ను అభినందించి వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.











