ఆశ్రమ హాస్టల్ కార్మికుల దీక్షకు సంఘీభావం .

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

ఆశ్రమ హాస్టల్ కార్మికుల దీక్షకు సంఘీభావం .

సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి  ముసలి సతీష్.

 చర్ల , నేటిసూర్య న్యూస్: తెలంగాణ రాష్ట్రoలో సంక్షేమ ఆశ్రమ హాస్టల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని గత 7 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని *సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు. శుక్రవారం చర్ల మండలం ఉంజుపల్లి ఆశ్రమ పాఠశాల ఎదుట ఆశ్రమ హాస్టల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ ఆశ్రమ హాస్టల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, డీఏలు, పీఎఫ్, ఇన్సూరెన్సు, పెరుగుతున్న మార్కెట్ ధరలకు తగినవిధంగా జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆశ్రమ కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతంచేసి మంత్రులను అడ్డుకుంటామని తెలిపారు. 64 జీవోని రద్దుచేసి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలను చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు కూడా తక్షణమే చెల్లించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమస్యలు రాకుండా డైలీ వేజ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని సమ్మె విరమింపజేయాలని మరియు హాస్టల్ వెల్ఫేర్ అధికారుల సమస్యలు కూడా పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వర్కర్లు వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్