జర్నలిస్టు తన వృత్తిని సేవగా భావించాలి
మీడియా అసలు బలం ప్రజల పక్షాన నిలబడటమే…
రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు
యూ ట్యూబ్ న్యూస్ ఛానల్స్ జిల్లా కమిటీ ఎన్నిక
సభ్యులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర కమిటీ
రాష్ట్ర నలు మూలల నుంచి 50మందికి పైగా ప్రతినిధులు హాజరు
ప్రతి జర్నలిస్టు తన వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సేవగా భావిస్తేనే సమాజంలో మార్పు తీసుకురాగలమని, మీడియా అసలు బలం ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను వెలుగులోకి తేవడంలోనే ఉందని రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు స్పష్టం చేశారు. ఆదివారం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జిల్లా కమిటీ ఎన్నిక ప్రక్రియ జరిగింది. గౌరవ అధ్యక్షుడు జయగణేష్ అధ్యక్షతన తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఎన్నిక కొత్తగూడెంలోని యుటీఎఫ్ భవన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూ ట్యూబ్ న్యూస్ ఛానళ్ల సీఈఓలు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు మాట్లాడుతూ… జర్నలిజం ఒక పవిత్రమైన బాధ్యత అని, ముఖ్యంగా నేటి కాలంలో యూట్యూబ్ ఆధారిత జర్నలిజం వేగవంతమైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. యూ ట్యూబ్ జర్నలిస్టులు మరింత బాధ్యతతో పనిచేస్తూ, నైతిక విలువలు కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో ఎన్నికైన కమిటీ ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సామాజిక సమస్యలను ఎటువంటి భయం లేకుండా ప్రజల ముందుంచాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా గౌరవ అధ్యక్షులుగా టి. రామ్ నరసింహా, అధ్యక్షులుగా అనిశెట్టి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులుగా మాలోత్ వేణు, ప్రధాన కార్యదర్శిగా కోడి రెక్కల కమలాకర్, కార్యదర్శి బీరా రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శిగా దాస్యం మహేష్, కోశాధికారిగా శనగ లక్ష్మణ్, గౌరవ సలహాదారులుగా బృహస్పతి శ్రీరామ్, ఋషి కుమార్ కార్యవర్గ సభ్యులుగా మోట జగదీష్, భూపతి అశోక్, సురేష్, ప్రసాద్ లను రాష్ట్ర కమిటీ అభినందించింది. భవిష్యత్తులో జిల్లాలో యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం, అలాగే వృత్తి నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని పులిపాటి హామీనిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ ముహమ్మద్ ఫైజుద్దీన్, జనరల్ సెక్రటరీగా పులకంటి శ్రీనివాస్, ట్రెజరర్ రామ్ టెంకి శ్రీనివాస్, సెక్రటరీ రామడుగు కొనరన్న, పల్లె నరసింహ రెడ్డి, సహాయ కార్యదర్శి కర్రే నరేందర్, గౌరవ సలహాదారు గౌస్ పాషా, ఎక్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డి. ప్రేమ్ కుమార్, భరత్ జిల్లా స్థాయి సభ్యులు నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.











