అమర వీరులకు నివాళులు…

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

ఘనంగా 77వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం.

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు.

 

చర్ల , నేటి సూర్య న్యూస్:

ఈ నెల 11 నుంచి 17 వరకు వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందామని అమర వీరులకు జోహార్లు నివాళులర్పిస్తూ ఘనమైన నివాళులర్పిద్దామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద తెలంగాణ సాయుధ పోరాట 77వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… నిజాం నిరంకుశ పాలనకు తొత్తులుగా ఉన్న పటేల్, పట్వారి, జమీందార్లను తరిమికొట్టిన కమ్యూనిస్టు గెరిల్లాలకు జోహార్లు… మీ స్ఫూర్తిని నేటి యువతరానికి అందిస్తామన్నారు. 1948 సెప్టెంబర్ 17న కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిందన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటాన్ని హిందు, ముస్లిం ఘర్షణలుగా చూపే మతోన్మాద కుట్రలను తిప్పి కూడదమన్నారు. పటేల్ చీకటి ఒప్పందం ఫలితమే నిజాం రాజుకు గవర్నర్ పదవీ తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన రద్దయింది తప్ప పటేల్ సైనిక చర్యల వల్ల కాదన్నారు. సాయిధ పోరాటంలో 4వేల మంది యువ కిశోరాలు చనిపోయారని 10లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర సీపీఐ పార్టీ దన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం విషయాలని అప్పుడే వారికి ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ సీపీఐ మండల కార్యదర్శి నూపా పోతయ్య, సీనియర్ నాయకులు నూక తిరుపతిరావు, పాలంచ రామారావు, సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు, చల్లా లక్ష్మీనారాయణ, పాలెం సత్యనారాయణ, కోడి రెక్కల రాజారావు, కొవ్వాసి దేవయ్య, భీమయ్య, మడకం నందయ్య, మురళి, గుండె సమ్మయ్య, నూపా రాము, డబ్బా శంకర్, గుండి శ్రీను, మడకం కమలేష్, మడకం సోమయ్య, సుక్కయ్య, పోశయ్య, దేవి మంగమ్మ, నరసమ్మ, అనసూర్య, జోడి రామయ్య, దీపక్, మహేష్, ముత్తయ్య, తోట శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్